నవతెలంగాణ - హైదరాబాద్: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమాపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. రజనీకాంత్ స్టార్డమ్, స్టైల్, ఆరా ఈ సినిమాలో అద్భుతంగా కనిపించాయని కొనియాడాడు. ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచే కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమా ఆకట్టుకుందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు.
ఈ మేరకు అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా స్పందించాడు. “రజనీ సార్ స్టార్డమ్, స్వాగ్, ఆరాకు ‘జైలర్ 2’ నిజమైన నిదర్శనం. సినిమా ఆద్యంతం ఉత్కంఠను కొనసాగించే కమర్షియల్ ఎంటర్టైనర్. అనిరుధ్ అదరగొట్టాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత ఈ సినిమా కోసం తమ హృదయాలను పెట్టి పనిచేశారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ అద్భుతమైన హిట్ అందించాడు. చొక్కా నలగకుండా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఒక్క రజనీగారికే సాధ్యం” అని ప్రశంసించాడు.
చొక్కా నలగకుండా రూ.500 కోట్లు కొట్టడం రజనీకే సాధ్యం: అల్లు అర్జున్
22 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)