నవతెలంగాణ-హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో రజత్ పాటిదార్ దుమ్మురేపాడు. కేవలం 48 బంతుల్లోనే 135(13 సిక్స్, 8ఫోర్లు) పరుగులు బాదాడు. దీంతో మధ్యప్రదేశ్ జట్టు అస్సాంపై 131 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. సోమవారం న్యూ చండీగఢ్‌లోని పీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో, పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్ సహాయంతో మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 250/6 అనే భారీ స్కోరును సాధించింది. ఇదే టోర్నీలో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ జట్లు కూడా తమతమ మ్యాచ్‌లలో విజయం నమోదు చేశాయి.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: రజత్ పాటిదార్ సంచలనం
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)