తెలంగాణలో ముగిసిన ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష..ఎంత మంది హాజరయ్యారంటే

6 గంటల క్రితం

Si Exam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : రాష్ట్రంలో 275 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 335 పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షకు ఏకంగా 90.44 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పోలీసు శాఖలో ఎస్‌ఐ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పరీక్షకు హాజరుకావడంతో కేంద్రాల్లో సందడి నెలకొంది. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు, సీసీటీవీ నిఘా మధ్య అధికారులు పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. అయితే, ప్రిలిమినరీ పరీక్ష ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాలు, తదుపరి ఎంపిక ప్రక్రియ అయిన శారీరక కొలతలు, సామర్థ్య పరీక్షలపై దృష్టి సారించారు. హాజరు శాతం భారీగా నమోదైన నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పరీక్షకు సంబంధించిన అధికారిక అప్‌డేట్ల కోసం అభ్యర్థులు www.tgprb.in వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్