Magazines

మక్తల్‌లో విషాదం..యువకుడి వేధింపులతో యువతి మృతి

14 నవంబర్, 2026

Tragedy in Makthal: Young woman dies following harassment by a youth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో యువకుడి వేధింపులతో ఓ యువతి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జౌళాపురం గ్రామానికి చెందిన అనిత (23) డిగ్రీ పూర్తి చేసి, తల్లికి వ్యవసాయ పనుల్లో సహాయపడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌కు చెందిన అనిల్ కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 12న కూడా ఫోన్ చేసి వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత తన పొలంలోని రేకుల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్