నవతెలంగాణ-హైదరాబాద్: డీలిమిటేషన్ కు డీఎంకే, ఎస్‌పీ మద్దతు తెలిపిన ఇండియా బ్లాక్ కూటమి వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో జాతీయ మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. "ఇండియా బ్లాక్ వైఖరి ఎలా ఉందో అలాగే ఉంటుంది. వారు(డీఎంకే, ఎస్‌పీ) ఈ బిల్లుకు మద్దతు ఇస్తే ఇండియా బ్లాక్ వైఖరి మారదు." అని తెలిపారు. బీజేపీపై ప్రజాగ్రహం పెరుగుతోందని, ప్రజాస్వామ్య పోరాటంలో టీడీపీ తో సహా పలు పక్షాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
నియోజకవర్గాల పునర్విభజనపై భారత కూటమి మిత్రపక్షమైన డీఎంకే వైఖరి గురించి అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, గాంధీ ఈ అంశాన్ని "ప్రజాస్వామ్య పోరాటం"గా అభివర్ణించారు. బీజేపీపై ప్రజాగ్రహం పెరుగుతోందని నొక్కిచెబుతూనే, టీడీపీతో సహా ఎన్డీఏ భాగస్వాములకు ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమిలో ఉన్న సభ్యులందరూ వంద శాతం ఏకీభవిస్తున్నారని, అయితే, తమతో ఏకీభవించని వారు కూడా కొందరు ఉన్నారు. వారికి ఒక విషయం అర్థం కావాలి, బీజేపీ ప్రయత్నం భారత ప్రజాస్వామ్యానికే మరణశాసనం వంటిదన్నారు.
"నేను జగన్‌కు,చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాను, అలాగే వారి భాగస్వాములకు కూడా చెబుతున్నాను: భారత ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోంది; దయచేసి మేల్కొనండి." అని ఆయన పిలునిచ్చారు.







కామెంట్‌లు (0)