మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ సాయం..

BRS assistance to the family of the deceased..నవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని కాటాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు గండు బిక్షపతి గౌడ్ తండ్రి గండు చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, టిఆర్ఎస్ నాయకులతో కలిసి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కీర్తిశేషులు గండు చంద్రయ్య దశదినకర్మకు 75 కేజీల ఫైన్ రైస్ (బియ్యం), నిత్యవసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా దిడ్డి మోహన్ రావు మాట్లాడుతూ గండు చంద్రయ్య చాలా మంచివారిని, మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం అన్నారు. ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కో ఆప్షన్ నెంబర్ దిలావర్ ఖాన్, మాజీ సర్పంచ్ లు పులి నర్సయ్య గౌడ్, మేడిశెట్టి నర్సిహ్మయ్య, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ హుస్సేన్ (వహీద్) సింగిల్ విండో డైరెక్టర్ పాలకుర్తి రజిత రవీందర్, దేశోజు కోటయ్య, యూత్ నాయకులు తడక హరీష్, బందెల తిరుపతి లంజపల్లి వెంకటేష్, సయ్యద్ అవేజ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love