భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ – చండూరు  
గట్టుప్పల మండలం  లోని  తేరేటిపల్లి గ్రామంలో ఎంపీటీసీ గొరిగే సత్తయ్య,  బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో  భువనగిరి ఎంపీ బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ  మల్లేశం గెలుపు కొరకు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కెసిఆర్ పాలనలో పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి పథకాల గురించి వివరించారు. అభివృద్ధి క్యామ మల్లేష్ గెలుపుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కెసిఆర్ భువనగిరిలో బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయిన క్యామ మల్లేష్ కు ఎంపీ టికెట్ ఇచ్చినందున  గెలిపించి కెసిఆర్ కు కానుకగా పంపాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి వెంకటయ్య పగిళ్ల  కొండయ్య, మలిగే  వెంకటేష్, పగిళ్ల   సైదులు, బుట్ట సుప్రీం, గొరిగే శంకర్,  రవితేజ, బండారి పూర్ణ,  మలిగే మల్లేష్,  బండ స్వామి, మలిగే నరేష్   తదితరులు పాల్గొన్నారు.
Spread the love