
మండలంలోని ముద్దులగూడెం గ్రామంలో మాడే నరసయ్య చిన్న కుమారుడు జగ్గారావు ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. శుక్రవారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గజ్జి ఎలేందర్ ఆధ్వర్యంలో జగ్గారావు కుటుంబానికి రూ.12,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎల్లెందర్ మాట్లాడుతూ జగ్గారావు మృతి విషాదకరమని ఆ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. జగ్గారావు తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాంచందర్, సీనియర్ మహిళా నాయకురాలు విజయక్క మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.