నవతెలంగాణ-సారంగాపూర్: మండలంలోని యాకార్పెల్లి గ్రామానికి చెందిన కల్లూరు భారతి(70) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నిర్మల్ ఇంచార్జీ రామ్ కిసాన్ రెడ్డి ,మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ లు బుధవారం మృతురాలి కుమారుడైన వెంకట్ ను పరామర్శించి మృతికిగల కారణాలను తెలుసుకొని ప్రగాఢ సంతాపం తెలిపారు. వీరి వెంటా..నాయకులు జీవన్ రావు,రామి రెడ్డి,దేవి శంకర్,లక్ష్మీనారాయణ గౌడ్,లక్ష్మణ్,గణేష్,సతీష్ శ్రీధర్ జీవన్ లు ఉన్నారు.