నవతెలంగాణ – ఆర్మూర్
ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ అన్నారు. పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏసీ పి వెంకటేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. బండి సంజయ్ కెసిఆర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మీరా శ్రావణ్, అగ్గు క్రాంతి, పృథ్వీరాజ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.