– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
నవతెలంగాణ-తొగుట: ఈనెల 27న హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభకు మండలం నుండి పెద్ద ఎత్తున తరలివెల్లి విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. శనివారం దుబ్బాక ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో బహిరంగ సభ సందర్బంగా తొగుటలో నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం అంటేనే ఉద్యమాల గడ్డ అని, నాటి తెలంగాణ పోరాటం నుండి నేటివరకు అడుగడుగునా బీఆర్ఎస్కు ప్రజలు జేజేలు పలుకుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యేక రాష్ట్ర సాధనలో, తెలంగాణ అభివృద్ధిలో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. 25 ఏళ్ల పార్టీ ఆవిర్బావ వేడుకలు పండుగలా నిర్వహించాలని కోరారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తొగుట మండలం నుండి 2500 మందిని బహిరంగ సభకు తరలించడంతరలిస్తామని అన్నారు. 27న బహిరంగ సభకు వెళ్లే ముందు అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి బయలు దేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కె.హరికృష్ణా రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి,మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలు వేరి మల్లారెడ్డి, మాజీ రైతు బంధు అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్ లు బోధనం కనకయ్య, బక్క కనక య్యలు, నాయకులు వేల్పుల స్వామి, కంది రాం రెడ్డి, సుతారి రమేష్, చెరుకు లక్ష్మారెడ్డి, చిక్కుడు రమేష్, స్వామి, ఎల్లం,మంగ నర్సింలు,మంగ యాదగిరి,అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.