దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నూతన లైబ్రరీ భవన నిర్మాణం కోసం వేసిన శిలాఫలకాన్ని 2019 సెప్టెంబర్ 1న అప్పటి మంత్రి తన్నీరు హరీష్ రావు దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి నన్ను ఇక్కడ స్థాపించారు. రూ.2 కోట్ల (ఎస్ డీఎఫ్ నిధులు)తో నిర్మించాలని తలిచారు. ఇప్పటికీ ఐదున్నర ఏళ్ళు అవుతున్నా.. ఎలాంటి పురోగతి లేదు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నూతన లైబ్రరీ భవనాన్ని నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు.