
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడవ టౌన్ పరిధిలోని తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగిందని నిజామాబాద్ నగర సీఐ నరహరి తెలిపారు. నగర సిఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హామల్ వాడిలో నివాసం ఉంటున్న పెంటయ్య ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళాడు. బుధవారం అర్ధరాత్రి దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో వున్న 13 తులాల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని దుండగులు దొంగలించారు. ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు మూడవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకోని చోరీ జరిగిన తీరును నగర సిఐ నరహరి మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. సభ్యుల నుండి ఫిర్యాదులు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.