తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలి: బుర్రి శ్రీనివాస్ రెడ్డి

– ప్రతి గ్రాడ్యుయేట్ ని కలిసి ఓటు అభ్యర్థించాలి
– మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్సీని గెలిపించుకునే బాధ్యత మనదే
– పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల, మున్సిపల్ చైర్మన్ బుర్రి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నల్గొండ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తీన్మార్ మల్లన్న గెలిపించుకునే బాధ్యత మనదేనని అన్నారు.ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓటున్న ప్రతి గ్రాడ్యుయేట్ వద్దకు వెళ్లి మన అభ్యర్థికి ఓటు వేసే విధంగా చూడాలన్నారు. ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించుకునే విధంగా కృషి చేయాలన్నారు. నల్లగొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రతి బూత్ లో ప్రచారం చేపట్టాలన్నారు.  గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక అక్రమాలను ప్రశ్నించిన వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టికెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ శ్రేణులు నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలన్నారు.  ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన పార్టీ శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య లు మాట్లాడుతూ ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ మనిమద్దె సుమన్, కనగల్ జెడ్పిటిసి చిట్ల వెంకటేశం, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు డాక్టర్ ఏఏ ఖాన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకట్ రెడ్డి, తీన్మార్ మల్లన్న టీం ఇన్చార్జి కొప్పు ప్రవీణ్, పలువురు కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ రూపా అశోక్ సుందర్, సూరెడ్డి సరస్వతి, నాగమణి రెడ్డి, లలిత, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love