
హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాడుగుల పల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కాకునూరి వెంకన్న గౌడ్ గుండెజబ్బుతో హైదరాబాదులోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం కన్నెకల్ మాజీ యంపిటిసి ఉయ్యాల నరసింహ గౌడ్, మరియు లక్ష్మీరెడ్డి ద్వారా తెలుసుకొని శుక్రవారం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగన్న పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు.అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గారకుంటపాలెం గ్రామానికి చెందిన ఉప్పల శ్రీనివాస్ రెడ్డి గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గార్లపాటి వెంకటరెడ్డి ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ దిలీప్ రెడ్డి,న్నెకల్ మాజీ యంపిటిసి ఉయ్యాల నరసింహ గౌడ్,అబ్దుల్ కరీం,నిమ్మల శ్రీకాంత్ రెడ్డి, రామలింగం, బుసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,బుసిరెడ్డి మట్టా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.