దేవాలయం ప్రాంగణం లో బోరు వేయించిన బుసిరెడ్డి పౌండేషన్

నవతెలంగాణ – పెదవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం, నెల్లికల్లు గ్రామంలోని గంగమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో త్రాగునీటి వసత లేకపోవడం వల్ల, గుడికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నెల్లికల్లు మాజీ సర్పంచ్ జనార్ధన్ రెడ్డి తెలియజేయగా, బుధవారం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి తన పౌండేషన్ తో బోరు వేయించారు. ఈసందర్బంగా పాండు రంగారెడ్డిని గ్రామస్తులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు చాలా సంతోషంగా ఉందన్నారు. మున్ముందు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని అన్నారు. మీ శ్రేయస్సే నాకు కొండంత బలం అని, గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి, నెల్లికల్లు సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, ముస్తాఫ, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, అనుముల కోటేష్, గజ్జల శివానంద రెడ్డి, ఇస్రం లింగస్వామి, నితిన్, పాతనబోయిన కోటయ్య, మల్లిఖార్జున చారి, రమేష్ చారి, వాడపల్లి శ్రీను ముదిరాజ్, శ్రీధర్ రెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి, నెల్లికల్లు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love