నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, నిడమనూరు మండలం, వేంపాడు గ్రామ కమిటీ వారి కోరిక మేరకు శ్రీ రఘురామ స్వామి ప్రధమ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం బుధవారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అర్వ స్వాతిఅశోక్, చింతల శంకర్, పొలగోని శ్రీను, బుర్రి పరమేష్, వెంపటి రాము, రాగం రవి పోతుగంటి కొండల్, దొడ్డ శ్రీను, కూరాకుల మల్లేష్, శిరసనగండ్ల మధు, శిరసనగండ్ల రాంబాబు, వెంపటి అంజి, ఊట విజయ్, నడ్డి నాగరాజు, రాగం శంకర్, రామ్ శంకర్, బుసిరెడ్డి ఫౌండేషన్ సభ్యులు మరియు వేంపాడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగినది.