క్యాన్సర్ పై అవగాహన అవసరం

– లయన్స్ క్లబ్ మండలాధ్యక్షుడు ఏదునూరి శ్రీనివాస్ 
నవతెలంగాణ –  పెద్దవంగర
క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని లయన్స్ క్లబ్ పెద్దవంగర మండలాధ్యక్షుడు ఏదునూరి సిరి శ్రీనివాస్, కోశాధికారి మొర్రిగాడుదుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం క్యాన్సర్ డే ను పురస్కరించుకుని, మండల కేంద్రంలో వారు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ..ప్రథమ దశలోనే వ్యాధిని గుర్తించి, చికిత్స అందిస్తే అరికట్టవచ్చునని అన్నారు. క్యాన్సర్ వ్యాధి సోకి ప్రతి సంవత్సరం మరణాల రేటు గణనీయంగా పెరుగుతుందన్నారు. ప్రతి ఐదుగురిలో నలుగురికి క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అవుతుందని, మొదటి దశలో గుర్తించక పోవడం వలన సుమారు 11 లక్షల మంది క్యాన్సర్ వ్యాధి ద్వారా మరణాలు చెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని చెప్పారు. క్యాన్సర్ రావడానికి మనం తీసుకునే ఆహార అలవాట్లు, మద్యపానం, ధూమపానం వాయు కాలుష్యం, ఎక్కువగా సూర్యరశ్మికి గురికావడం పరిసరాల పరిశుభ్రత లేకపోవడం, పురుషుల్లో గొంతు,  స్త్రీలలోనూ రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా రావడంతో మరణాల రేటు పెరుగుతుందన్నారు. త్వరలోనే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిపుణులైన క్యాన్సర్ వైద్యులచే స్క్రీనింగ్ చెక్ అప్ క్యాంపు లను నిర్వహిస్తామని వెల్లడించారు.
Spread the love