Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంమమతా బెనర్జీపై కేసు న‌మోదు

మమతా బెనర్జీపై కేసు న‌మోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కేసు న‌మోదు అయింది. సిలిగిరి పోలీసు స్టేషన్‌లో హిందూ మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆమెపై కేసు నమోదైంది.

గతేడాది కోల్‌కతాలో జరిగిన ఈద్ వేడుకల్లో మమతా బెనర్జీ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి “గందా ధర్మ” (మురికి మతం) అని హిందూ ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని అడ్వకేట్ రింకీ ఛటర్జీ సింగ్ నిన్న (మంగళవారం) సిలిగురి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని పాటించే కోట్ల మంది ప్రజల మతపరమైన నమ్మకాలను తీవ్రంగా గాయపరిచాయని, సమాజంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -