ఆర్ఎంపిపై కేసు నమోదు 

Case registered against RMP– ములుగు జిల్లా ఔషధ నియంత్రణ అధికారి, పావని
నవతెలంగాణ – తాడ్వాయి 
లైసెన్సు లేకుండా మందులు అమ్ముతున్న ఆర్ఎంపి పై కేసు నమోదు చేసిన ఘటన మంగళవారం మేడారం గ్రామంలో చోటుచేసుకుంది. ములుగు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారిని పసునూటి పావని తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడారం గ్రామంలో గత కొంతకాలంగా గాదం మనోజ్ అనే ఆర్ఎంపి, మేడారంలో ఆర్.ఎం.పి ప్రాక్టీస్ చేస్తూ అక్రమంగా మందులు నిల్వచేసి వ్యాపారం కొనసాగిస్తున్నాడని తెలిపారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు దాడులు చేయగా 18 వేల విలువైన 26 రకాల మందులు, తొమ్మిది రకాల ఫిజీషియన్ షాంపుల్స్ మందులు లభించాయన్నారు. మొత్తం 35 రకాల మందులను సీజ్ చేసి ఆర్ఎంపి మనోజ్ పై ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని పావని వివరించారు. సేవ ముసుగులో నకిలీ వైద్య వ్యవస్థలు ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు.
Spread the love