Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టెన్త్ జిల్లా టాపర్ ప్రణవికి నగదు బహుమానం

టెన్త్ జిల్లా టాపర్ ప్రణవికి నగదు బహుమానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా సంస్థలలో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం విద్యా విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్, విద్యా శాఖకు చెందిన అకడమిక్ ఆఫీసర్ విజయ్ పాల్ రెడ్డి, క్యాంప్ మొబైలింగ్ ఆఫీసర్ రమేష్ మొదలగు సెక్టోరియల్ ఆఫీసర్స్ చేతుల మీదుగా పదవ తరగతి ముగ్గురు టాపర్ లను, ఇంటర్మీడియేట్ 3 టాపర్ లను, స్పోర్ట్స్ టాపర్ లను మొదలగు 11 మందిని ప్రశంసా పత్రాలను అందించారు. అదేవిధంగా వారిని సత్కరించి రూ.10 వేల చెక్కులను అందజేశారు. అందులో భాగంగానే జెడ్ పి హెచ్ ఎస్ తాడిచెర్ల నుంచి జిల్లా టాపర్ గా నిలిచిన మేనం ప్రణవిని విద్యాశాఖాధి అభినందించి, రూ. 10 వేలు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుమారస్వామి, రమేష్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -