Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఏసీబీ దాడుల్లో నగదు పట్టివేత..

ఏసీబీ దాడుల్లో నగదు పట్టివేత..

- Advertisement -

ఏసీబీ దాడుల్లో ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, సిబ్బంది
నవతెలంగాణ – మద్నూర్
: మండల పరిధిలోని సలాబత్పూర్ అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్ పోస్టులో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. రూ.92 వేల అక్రమ వసూళ్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న ఒక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కు ఒక కానిస్టేబుల్ కు, ఇద్దరు ప్రయివేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ డబ్బులు పట్టకున్నారు. ఇలాంటి వ్యవహారాలపై ఏసీబీ అధికారులు ఇక్కడ ఎలాంటి పత్రికా ప్రకటన చేయకపోవడం గమనార్హం. అయితే నిందితుల్లోని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఏసీబీ కోర్టులో హాజరపరుస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ డిఎస్పి శ్రీనివాస్ గౌడ్, సిఐలు నరేష్, శ్రీనివాస్, నవీన్, మరికొందరు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -