
– గొర్రెలు మేకల పెంపకదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి డిమాండ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
డీడీలు వాపసు వద్దు నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ చేయాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఎం వి ఎన్ భవన్ లో జరిగిన గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సంధర్భంగా రవి మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం గొల్లకురుమలకు గొర్రెల పంపిణి కార్యక్రమం 2017 చేపట్టి కోటీశ్వర్లను చేస్తామని చెప్పి 7 సంవత్సరాలనుండి గొర్రెలు పంపిణి పూర్తి చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో అనేక అక్రమాలు జరిగినవని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఒక్కొక్కరు 43750 రూపాయలు డి డి లు కట్టి చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 100 రోజుల్లో రెండు లక్షల రూపాయలు పెట్టి గొర్రెలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రకారం చేయాలన్నరు. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా వారు తీసిన డీడీల డబ్బులు తిరిగి ఇవ్వడం సరి కాదన్నారు. డీడీ లు తీసిన వారందరికీ గొర్రెలకు బదులుగా,నగదు బదిలీ చేసి గొల్ల కురుమలను ఆదుకోవాలని కోరారు.గొర్రెలు పంపిణిలో అనేక అక్రమాలు జరిగాయని.. పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమర్కులపైన చట్టపరమైన చర్యలు తీసుకొని మా గొల్ల కురుమలకు న్యాయం చేయాలని, లేకుంటే సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య ఉపాధ్యక్షులు చింతల లింగయ్య కే సాంబయ్య శ్రీనివాస్ కోడి ఎల్లయ్య యాదవ్ లింగయ్య పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.