– అడ్డుపడుతున్న అగ్రకుల నేతలు
– అధికారులను అడ్డం పెట్టుకొని అడ్డుకుంటుండ్రు
– దళిత యువకుల ఆరోపణ
నవతెలంగాణ – ఉప్పునుంతల
అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి అగ్రకుల నేతలు అడ్డుపడుతూ కులవివక్ష చూపుతున్నారని దళిత యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని కొరటికల్ గ్రామంలోని యువకులు తెలుగు నూతన సంవత్సర సందర్భంగా రాజ్యంగా నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తమ గ్రామంలో ఏర్పాటు చేయాలని యువకులు నిర్ణయించి గ్రామంలోని ప్రధాన కూడలి అయిన గ్రామపంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేయాలనీ నిర్ణయించి ముగ్గుపోసి జేసీబీ సహాయతో పనులు మొదలు పెడుతుంటే వద్దని అగ్రకుల నేతలు అడ్డుకున్నారని గ్రామ దళిత యువకులు వాపోయారు. పంచాయతీ కార్యదర్శిపై వత్తిడి చేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా విగ్రహం పెట్టారదని అయన సూచించారు. పనులు నిలిపేసి వెంటనే మండల కేంద్రానికి చేరుకొని స్థానిక ఎంపీడీఓ మోహన్ లాల్ ను కలిసి మాకు విగ్రహ నిర్మాణం చేపట్టడానికి అవకాశం కల్పించాలని వినతి పత్రం అందజేస్తే జిల్లా కలెక్టర్ ను కలిసి పర్మిషన్ తీసుకోవాలని అయన సూచించడంతో చేసేదేమిలేక తిరిగి వచ్చినట్లు వారు తెలిపారు. త్వరలోనే కలెక్టర్ ను కలిసి సమస్య ను వివరించి ఖచ్చితంగా అక్కడే విగ్రహ నిర్మాణం చెప్పాడుతామని యువకులు తెలిపారు. అన్ని గ్రామాల్లో ప్రధాన చౌరస్తాల్లోనే విగ్రహాల నిర్మాణం చేపట్టారాని మా గ్రామానికే ఈ కులవివక్ష ఎందుకానీ వారు ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రనే అని వారు ఆరోపించారు. కార్యక్రమంలో కొరటికల్ గ్రామ దళిత యువకులు ప్రకాష్, ఆనంద్, డిలీఫ్, సందీప్, గణేష్, అనిల్, సాయితేజ తదితరులు ఉన్నారు.