కావేరీ సీడ్స్‌ లాభాల్లో 29 శాతం వృద్ధి

29 percent growth in Kaveri Seeds' profitsహైదరాబాద్‌ : ప్రముఖ విత్తనాల కంపెనీ కావేరీ సీడ్స్‌ 2024-25 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 29.05 శాతం వృద్ధితో రూ.15.04 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.11.66 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.118.47 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ3లో 30.63 శాతం పెరిగి రూ.154.77 కోట్లకు చేరినట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి తొమ్మిది మాసాల్లో 1.46 శాతం పెరుగుదలతో రూ.294.46 కోట్ల నికర లాభాలు ఆర్జించినట్టు పేర్కొంది. వరి, మొక్కజొన్న విభాగాల్లో మెరుగైన ప్రగతిని కనబర్చినట్టు ఆ కంపెనీ సీఎండీ జివి భాస్కర్‌ రావు తెలిపారు.

Spread the love