– కేంద్ర మంత్రులకు రైతు కమిషన్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పత్తి కొనుగోళ్లలో సీసీఐ మోసం చేస్తున్నదని వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఆరోపించింది. ఎనుమాముల మార్కెట్, జిన్నింగ్ మిల్‌లో పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయాలను కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలించారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ విషయాలను బుధవారం పార్లమెంట్ ఆవరణంలో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్, కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌లకు వినతిపత్రం సమర్పించారు.