ముధోల్ సిఐ రవీంధర్ నాయక్
నవతెలంగాణ – ముధోల్
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ముధోల్ సిఐ రవీంధర్ నాయక్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ పోలీస్ శాఖ సూచన మేరకు స్థానిక సర్పంచ్ షబానా ఎజాజోద్దిన్, కోరి లావణ్య సాయినాథ్ ఆధ్వర్యంలో గురువారం రోజు స్థానిక చౌక్ మాజీద్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహద పడతాయన్నారు. వ్యాపార దుకాణాల వద్ద తప్పనిసరిగా యాజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్థానిక గ్రామపంచాయతీ, గ్రామ పెద్దలు, సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించడం అభినందనీయం అన్నారు. పోలీస్ శాఖ నిరంతరం శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బిట్ల పెర్సిస్, వార్డు సభ్యులు, స్థానికులు, పాల్గొన్నారు.
నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఉపయోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



