శ్రీ సరస్వతీ మాత ఆలయ వార్షికోత్సవ వేడుకలను జయప్రదం చేయండి..

– బ్రహ్మశ్రీ రామగిరి సోమలింగం సోమలక్ష్మి ఆచార్యులు
నవతెలంగాణ – ధర్మసాగర్
మండలంలోని రాయగూడెం గ్రామంలో ఉన్న శ్రీ సరస్వతీ మాత ఆలయ ఆరవ వార్షికోత్సవ వేడుకలను  విజయవంతం చేయాలని అమ్మవారి సేవకులు, వాస్తు బ్రహ్మ, బ్రహ్మశ్రీ రామగిరి సోమలింగం సోమలక్ష్మి ఆచార్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రామగిరి సోమలింగం సోమలక్ష్మి మాట్లాడుతూ కళల కాణాచి ఓరుగల్లు మహానగరానికి సమీపంలో ఉన్న బుగులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు వెళ్ళే దారిలో ఎందరో మహానుభావుల, శ్రేయోభిలాషుల,భక్తాభీష్ట సిద్దర్యథం నిర్మితమైందన్నారు.శ్రీ సరస్వతీ దేవి నాచే సంకల్పించి నిర్మించిన శ్రీ సరస్వతీ మాత ఆలయం, ఇటీవల కాలంలో భవ్యంగా నిర్మించబడిన శ్రీ సోమ లింగేశ్వర శివాలయం భక్తజన మనోరంజకాన్ని కల్పిస్తూ,మానసిక ప్రశాంతత,సర్వ దోషాలను హరించే కల్పవల్లిగా నిత్య పూజాభిషేకాలు అందుకుంటున్నాయన్నారు. శ్రీ సరస్వతీ మాత ఆలయం ఆరవ వార్షికోత్సవం ఈ నెల 16న జ్యేష్ట శుద్ధ దశమి నాడు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయని తెలిపారు. 16 వ తేదీన ఆదివారం రోజు ఉదయం శ్రీ శారదా పరమేశ్వరికి విశేష అభిషేకాదులు, మహాపూజ,శాంతి పూర్వక హవనాదులు, మహా అన్న ప్రసాద వితరణలు జరుగుతాయని వివరించారు.ఈ క్రమంలో భక్తులు అందరు విశేష సంఖ్యలో తరలి వచ్చి ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్చాశక్తి, జ్ఞాన శక్తి, క్రీయా శక్తి స్వరూపిణి అయిన శ్రీ సరస్వతీ మాత వేడుకలకు తరలి వచ్చి శ్రీ శారదా పరమేశ్వరి కృపా కరుణా కటాక్షాలకు పాత్రులు కాగలరని ఈ సందర్భంగా వారు కోరారు.
Spread the love