ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ తప్పక దేశ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ త కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల  రాజయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాషా, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, రాపల్లి రామన్న తదితరులున్నారు.
Spread the love