బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడంపై బీసీ కులాల ఉద్యమ పోరాట సమితి నాయకులు గురువారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో సంబురాలు జరుపుకున్నారు. సందర్భంగా బీసీ ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ కొడూరి చంద్రయ్య మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా బీసీ సంఘాలు చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు. బీసీ బిల్లును ఆమోదించడం తో సీఎం రేవంత్రెడ్డికి, ఆమోదించిన ప్రతిపక్ష నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అనం తరం తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట టపాసు లు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్ర మంలో బీసీ ఉద్యమ పోరాట సమితి జిల్లా నాయకులు కడార్ల నర్సయ్య, ఆడెపు లక్ష్మీనారాయణ, గం గాధరౌడ్, అశోక్, రాగుల శంకర్, మూల భాస్కర్, ఐలవేని రవి, పురుషోత్తం, శ్రీనివాస్, శ్రీనివాసగౌడ్, నాగెందర్, రమణ, వెంకటేశ్, మధు తదితరులు పాల్గొన్నారు.