ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ..

నవతెలంగాణ – పెద్దవంగర

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ఆయా పార్టీ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎర్ర సబిత వెంకన్న, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎస్సై మహేష్, ఏపీఎం రమణాచారి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, బీజేపీ మండల అధ్యక్షుడు బొమ్మెరబోయిన సుధాకర్ యాదవ్, ఏఈవో లు, ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మండల ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను కొనియాడారు. మండల కేంద్రానికి చెందిన ఉద్యమకారులు సుంకరి మురళీధర్, బోగోజు రత్నవిలాచారి లను కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
Spread the love