క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్ బ్యానర్‌పై బేబీ హరిణి సమర్పణలో తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ సస్పెన్స్ చిత్రం ‘అరేయ్ ఆపండ్రా’. అశోక్ నిమ్మల నిర్మాత.
వెంకట్ దుగ్గిరెడ్డి, అంజాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సుదర్శన్, భద్రం, తల్లాడ సాయి కృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్ అందుకున్న సందర్భంగా నిర్మాత అశోక్ నిమ్మల మాట్లాడుతూ, ‘ఈ సమ్మర్‌లో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన కామెడీ సినిమాని అందించబోతున్నాం. సుదర్శన్, భద్రం, తల్లాడ సాయికృష్ణ అద్భుతంగా నటించారుఅని తెలిపారు. 'ఇలాంటి ఓ మంచి సినిమాలో భాగమైనందుకు, అలాగే సినిమాలో ప్రత్యేక పాత్రని పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది అని సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి చెప్పారు. మరో సహ నిర్మాత అంజాద్ మాట్లాడుతూ, ‘థియేటర్లలో మా తల్లాడ సాయి కృష్ణ కామెడీ మార్క్ ని ప్రేక్షకులు చూసి కడుపుబ్బా నవ్వుకుంటారుఅని అన్నారు. దర్శకుడు, నటుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ, 'సమ్మర్ లో మంచి కూల్ సినిమా. మంచి కంటెంట్తో సినిమాని సిద్ధం చేశాం. సెన్సార్ సభ్యులు సైతం సినిమాని చూసి అభినందించారు అని తెలిపారు.
‘అరేయ్ ఆపండ్రా`కి సెన్సార్ ప్రశంసలు
- Advertisement -
- Advertisement -



