నూతన ప్రతిభను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ. సాయి తేజ్, వేద జలంధర్ హీరో, హీరోయిన్లు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్నిసొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నేటి (శుక్రవారం) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా 'తిమ్మరాజుపల్లి టీవీ సంబరాలు వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆహా నుంచి శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా కోసం ఫస్ట్ టైమ్ కిరణ్ గారితో మాట్లాడాను. అప్పటి నుంచి వారితో మా ఆహా జర్నీ కంటిన్యూ అవుతోంది. సమ్మతమే, రూల్స్ రంజన్, కె ర్యాంప్..ఇలా ఆయన సినిమాలన్నీ మా ఆహాలో స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాను ఆహా సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందిఅని తెలిపారు. 'ఈ సినిమాతో మేము ఎలాంటి విజయాన్ని ఆశించామో, ఎలాంటి రెస్పాన్స్ ఆశించామో అది దక్కింది అని డైరెక్టర్ వి.మునిరాజు చెప్పారు. ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,’ నా సక్సెస్, ఫెయిల్యూర్లో ఆహా తోడుగా ఉంది. ఆహాలో నా సక్సెస్ ఫుల్ సినిమాలతో పాటు ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయి. రామ్, అరవింద్, కిరణ్ సినిమా అంటే నమ్మకంతో తీసుకుంటారు. శ్రీనివాస్ నాతో ఒక సోదరుడిలా ఉంటారు. ఈ సినిమా విషయంలో సంతృప్తిగా ఉన్నాను. ఇలాంటి కాంపాక్ట్ బడ్జెట్ లో మేము విజయం సాధించాం. అది మా మూవీ టీమ్ వల్లే సాధ్యమైంది. ఇక పై కూడా ఇలాగే మంచి సినిమాలు నిర్మిస్తాను` అని తెలిపారు.
ఆహాలో ‘తిమ్మరాజుపల్లి టీవీ` సందడి
- Advertisement -
- Advertisement -



