– నీట్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలి..
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
బొగ్గు గనుల వేలం పాట ఆపాలని, నీట్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా శుక్రవారం సీపీఐ(ఎం), న్యూ డెమోక్రసీ, సీపీఐ ఎంఎల్ మాసలేన్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని, నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని అన్నారు. సింగరేణి కంపెనీ కూడా ప్రయివేటు సంస్థలతో పాటు వేలంపాటలో పోటీ పడాలని నిర్వహించిందన్నారు. తెలంగాణలో సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థఅన్నారు. సహజంగానే శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలికానీ వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు అవకాశం ఇస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే నాలుగు బ్లాకులు గత బీఆర్ఎస్ పాలనలోనే మోడీ ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అప్పగించిందని ఆరోపించారు. మన రాష్ట్రం నుంచే బొగ్గు గనుల శాఖామంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాదు కేంద్రంగానే వేలంపాట ప్రక్రియను ప్రారంభించటం అన్యాయమన్నారు. పైగా సింగరేణిని ప్రయివేటీకరించబోమని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. బొగ్గు బ్లాకులన్నీ ప్రయివేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముందని ప్రశ్నించారు.

మోడీ ప్రభుత్వం కోల్మైన్స్ చట్టాన్ని, మినరల్స్ & మైనింగ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టాలకు సవరణలుప్రైవేటు సంస్థలకు అనుగుణంగాచేసిందన్నారు. సింగరేణికి చెందిన 22 బొగ్గు బావుల్లో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయిని, కొత్త బ్లాకుల్లో తవ్వకాలు ప్రారంభించాలన్నారు. కాని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇందుకు అనుమతించడం లేదనిఆవేదన వ్యక్తం చేశారు. వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నదని తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. వేలం పాట ప్రారంభం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇది వేలంపాట ప్రక్రియను ఆమోదించడమే కదాఅని ప్రశ్నించారు. గతంలో ప్రయివేటు సంస్థలకు అప్పగించిన మరో రెండు బ్లాకుల్లో ఇప్పటికీ తవ్వకాలు ప్రారంభం కాలేదని అందువల్ల శ్రావణపల్లి బ్లాకుతో పాటు, ఆ రెండు బ్లాకులను కూడా తక్షణం సింగరేణికే అప్పగించాలని ప్రభుత్వం ఎత్తిస్తుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకుని కేంద్రం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్రం ఆమోదించకపోతే రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
కేవలం విజ్ఞప్తులతో సరిపెట్టవద్దు.నీటి పరీక్ష పేపర్ లీకేజీ వల్ల 23 లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజ్ కి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ మహా ధర్నాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపిజిల్లా కమిటీ సభ్యులు జిల్లా పెళ్లి నరసింహారావు, వేల్పుల వెంకన్న, దండా వెంకటరెడ్డి, మేకనబోయిన శేఖర్, వీరబోయిన రవి, మిట్టగనుపుల ముత్యాలు, పులుసు సత్యం, దేవరం వెంకటరెడ్డి , బెల్లంకొండ సత్యనారాయణ, కొప్పుల రజిత, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బొడ్డు శంకర్, పోలే బోయిన కిరణ్, కొనుకుంట్ల సైదులు,నల్లగొండ నాగయ్య,పుల్లూరి సింహాద్రి, పిడమర్తి భరత్, సామ నర్సిరెడ్డి, మందడి శ్రీధర్, మై బి ళ్లి , సైదులు, వినోద్ రెడ్డి, రవి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కొత్తపల్లి రేణుక, చంద్రకళ,ప్రజా సంఘాల నాయకులు ములకలపల్లి రాములు,రణపంగా కృష్ణ, షేక్ సైదా, నాగటి చిన్న రాములు, వల్లపు దాసు సాయికుమార్, షేక్ జహంగీర్, అరవపల్లి లింగయ్య,దేవరకొండ యాదగిరి, కోడి ఎల్లయ్య, మామిడి పుల్లయ్య, ఆరే రామకృష్ణారెడ్డి, వీరబోయిన వెంకన్న, బొమ్మిడి లక్ష్మీనారాయణ, కాసాని కిషోర్, బెల్లంకొండ వెంకటేశ్వర్లుతదితరులు పాల్గొన్నారు.