
– చెరుపల్లి సీతారాములు (సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ)
నవతెలంగాణ – భువనగిరి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేదిగా లేదని, పేద ప్రజలను పూర్తిగా విస్మరించిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.శుక్రవారం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జరిగిన జిల్లా జనరల్ బాడీ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని పూర్తిగా రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించి బడా కార్పోరేట్ శక్తులకే ఊడిగం చేసే విధంగా బడ్జెట్ ఉందని వారు అన్నారు. విద్య వైద్య రంగాన్ని ఉపాధి అవకాశాలను పూర్తిగా విస్మరించి బడ్జెట్ పెట్టారని వారన్నారు. పేద ప్రజలకు, కార్మిక వర్గానికి, మహిళలకు, విద్యార్థి యువజనలకు ఆమడ దూరంలో కేంద్ర బడ్జెట్ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బడా కార్పొరేట్ శక్తులకే పెద్ద పీట వేస్తూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం బీజేపీ ప్రభుత్వానికి పేద ప్రజలపై ఉన్న చిత్తశుద్ధి కనపడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరానికి ఆమడ దూరంలో ఉన్న భువనగిరి జిల్లా కేంద్రానికి నాలుగు లైన్ల రైల్వే లైన్, మెట్రో కు సరిపడా వరాలు ఇవ్వకపోవడం, దాదాపు నాలుగు జిల్లాలకు వైద్య సదుపాయం కల్పించే ఎయిమ్స్ కు అధిక నిధులు కేటాయించకపోవడం పేద ప్రజల వైద్యం పట్ల బీజేపీ ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తుందని వారు అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించవలసిన బడ్జెట్ విషయంలో పూర్తిగా జిల్లాను విస్మరించిందని వారు అన్నారు. వీరితోపాటు సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, బొల్లు యాదగిరి, ఎండి పాషా, పగిళ్ల లింగారెడ్డి, బబ్బులు పోశెట్టి, బొడ్డుపల్లి వెంకటేష్, గుంటూజు శ్రీనివాసాచారి, గుండు వెంకటనర్సు, గంగాదేవి సైదులు, బండారు నరసింహ, దోడ యాదిరెడ్డి, మద్దేపురం రాజు, బోలగాని జయరాములు, గడ్డం వెంకటేష్, ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శులు దూపటి వెంకటేష్, పోతరాజు జహంగీర్, రేఖల శ్రీశైలం పాల్గొన్నారు.