వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 4 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి జులై 4 నుంచి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు TGPSC వెల్లడించింది. హైదరాబాద్‌లోని కార్యాలయంలో ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని తెలిపింది. గత ఏడాది జులైలో నిర్వహించిన రాత పరీక్షకు 913 మంది హాజరయ్యారు. ఈ ఏడాది మార్చిలో ఫలితాలు వెల్లడయ్యాయి.

Spread the love