చైన్ స్నాచింగ్ చేయుచున్న నిందితుని అరెస్టు..

నవతెలంగాణ – చిన్నకోడూరు 

వరుస చైన్ స్నాచింగ్స్ తో ద్విచక్ర వాహనదారుల్ని భయభ్రాంతులకు గురిచేసిన చైన్ స్నాచర్ ని చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పట్టుకున్నట్లు చిన్నకోడూరు ఎస్సై బాలకృష్ణ తెలిపారు.  సిద్దిపేట ఏసిపి మధు కేసు వివరాలు తెలుపుతూ.. ఒక వ్యక్తి సిద్దిపేట వైపు నుండి ఒక వ్యక్తి తన మోటార్ సైకిల్ అయిన పల్సర్ బైక్ టిఎస్ 10ఎఫ్ జి 0350 పై కరీంనగర్ వైపు వెళ్ళుచు వాహనం తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి భయాందోళనకు గురవుతూ ఉండగా వెంటనే అతనిని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద బంగారు ఆభరణాలు కలవు. వాటి వివరాలు అడుగగా తను తడబడుతూ సమాదానం చెప్పగా అనుమానం వచ్చి విచారణ చేయగా జల్సాలకు డబ్బులు లేనందున దొంగతనాలు చేసి జల్సాలు చేద్దామని నిర్ణయించుకుని చైన్ స్నాచింగ్ దొంగతనాలు తానే చేసినానని చిగురుమామిడి మండలం గాగిరేడ్డిపల్లీ గ్రామానికి చెందిన కుమ్మం రాకేశ్ తండ్రి రమేష్ ఒప్పుకున్నట్లు ఏసిపి తెలిపారు. నిందితుడు వద్ద నుండి దొంగలించిన బంగారు వస్తువులు మరియు బంగారు కడ్డీ కలిపి మొత్తం 5 తులాల 9 గ్రాములు మరియు దొంగతనానికి ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ పల్సర్ బైక్ స్వాధీన స్వాధీనం చేసుకొని పై నిందితున్ని చిన్నకోడూర్ ఎస్ఐ బాలకృష్ణ, అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. చాకచక్యంగా టెక్నాలజీతో పై నిందితున్ని పట్టుకున్నందుకు సిద్దిపేట ఏసిపి మధు చిన్నకోడూరు ఎస్ఐ మరియు సిబ్బందిని అభినందించారు. ఎస్ఐ, సిబ్బందికి త్వరలో పోలీస్ కమిషనర్ మేడం గారితో రివార్డ్ అందజేస్తామని తెలిపారు.
Spread the love