ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలి: చల్మెడ

– గద్దెనెక్కాక మాట తప్పుతారా.!
– బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు..
నవతెలంగాణ – వేములవాడ 
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ ఆర్ఎస్ పేరిట ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచితంగా అమలు చేస్తానని ఎలా మాట తప్పారంటూ  వేములవాడ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ,ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క , మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి  తదితరులు నాడు ఫ్రీగా అమలు చేయాలని కోర్టులను కూడా ఆశ్రయించారని గుర్తు చేశారు. 24 లక్షల మంది దరఖాస్తుదారుల నుండి 20వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నింపేందుకు మాట మార్చారా అని ప్రభుత్వంలోని మంత్రులను ప్రశ్నించారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీలు చంద్రయ్య గౌడ్, బండ మల్లేశం యాదవ్, బైరగోని లావణ్య, సెస్ డైరెక్టర్ లు రేగులపాటి హరి చరణ్ రావు, ఆకుల దేవరాజు, పార్టీ పట్టణ కార్యదర్శి క్రాంతి కుమార్, అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య,  కౌన్సిలర్లు నిమ్మశేట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, నరాల శేఖర్, శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, తీగల రవీందర్ గౌడ్, రామతీర్థం రాజు, ఏస  తిరుపతి, గోపు బాలరాజు, ఆర్ సి రావు, గజానంద రావు, పొలాస నరేందర్, నరాల దేవేందర్,  వెంగళ శ్రీకాంత్ గౌడ్, కమలాకర్ రెడ్డి, లింగంపేట ఎంపీటీసీ రమేష్ రావు, ఈర్లపల్లి రాజు, పోతు అనిల్ కుమార్, సుంకపాక రాజు, నాంపల్లి శ్రీనివాస్, లిక్కిడి మహేందర్ రెడ్డి, ఫర్వేజ్, పెరుమాళ్ళ రవి చందర్ గౌడ్ , చీటీ సంధ్యారాణి, కోమురవ్వ, హరినాథ్ రావు,   తోపాటు తదితరులు పాల్గొన్నారు..
Spread the love