సీతారామ మున్నూరు కాపు సంఘం అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తానని ఆ సంఘం నూతన అధ్యక్షుడు చామర్తపు సాంబశివరావు అన్నారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో సీత రామ మున్నూరు కాపు సంఘం పసర సమావేశం ఉపాధ్యక్షుడు జీవంజి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు అనిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో సంఘం యొక్క గత కార్యక్రమాలు సమీక్షించుకుని భవిష్యత్తు సంఘ అభివృద్ధి కోసం కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య సలహాదారులు జీవంజి కృష్ణమూర్తి, అల్లూరి నాగేశ్వరరావు, సిరంగి సారయ్య, బజార్ అజయ్ నూతన కమిటీ అధ్యక్షులు.. చామర్థపు సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కడియాల లక్ష్మణ్, కోశాధికారి పిట్టల శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు పిట్టల కృష్ణ , సామర్తపు నాగేశ్వరరావు, రాంగం రామ్మూర్తి, గాండ్ల కల్పన, సహాయ కార్యదర్శిలు.. త్రిపురాని వెంకటేశ్వరరావు, ఉప్పు మహేందర్, ఆకుల రవి, గోసుల రవి,కందుల రాజేశ్వరి, ప్రచార కార్యదర్శి సూరారపు రాజు కమిటీ సభ్యులుబీరెడ్డి సాంబశివ, బజార్ గంగాధర్ రావు, మిర్యాల వెంకన్న, ఎర్రవెల్లి రాజు, ఏనే సంపత్, ప్రచార కార్యదర్శి సూరారపు రాజు లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సామర్థపు సాంబశివరావు మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎంపిక చేసిన సంఘం సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపుతూ నాపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా సంఘం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.