మొక్కు తీర్చుకున్న చంద్రబాబు వీరాభిమాని..

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలోని శ్రీ ఆంధోళ్ మైసమ్మ దేవాలయంలో నారా చంద్రబాబు నాయుడు వీరాభిమాని దేప శ్యాంసుందర్ ముదిరాజ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా విజయం సాధించి నాల్గవ సారి ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలో మంగళవారం శ్రీ ఆంధోళ్ మైసమ్మ దేవాలయంలో నూటక కొబ్బరికాయలు కొట్టి మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయం లో అర్చకులచే నారా చంద్రబాబు నాయుడి గారి కుటుంబ పేరు మీద అర్చన చెయ్యించడం జరిగింది. అనంతరం శ్యాంసుందర్ మాట్లాడుతూ ముందుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కు ధన్యవాదాలు తెలిపారు. దేశాన్ని పాలించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కావడం తెలుగుప్రజలకు చాలా అభినందనీయం అని కోనియడారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ఆ మైసమ్మ తల్లిని ముక్కకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారా నందమూరి అభిమానులు దేప నాగేష్,మునుకుంట్ల నర్సింహ్మ,బుర్ర ముత్యాలు,పబ్బు శ్రీనివాస్,యండి సాదిక్,ముదిగొండ రమేష్,సిల్వెరు బిక్షపతి,ముదిగొండ వేంకటేష్,రాచర్ల ఈశ్వర్,దౌడి లింగస్వామి, సత్యబోయిన మల్లేష్,గుండ్ల లింగస్వామి ,చందుపట్ల సాయి నేత,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love