- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా వేధించి, నగ్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి సహ విద్యార్థి సంతోష్‌కుమార్ ప్రేమ పేరుతో దగ్గరై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీడియో కాల్స్ సమయంలో నగ్న దృశ్యాలను రికార్డ్ చేసి, డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల బాధితురాలి సోదరుడికి ఆ ఫొటోలు, వీడియోలు పంపినట్లు వెల్లడైంది. కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -



