Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏవో తనిఖీలు బయటపడ్డ గడువు ముగిసిన రసాయన మందులు

ఏవో తనిఖీలు బయటపడ్డ గడువు ముగిసిన రసాయన మందులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్  : మండల కేంద్రం లోని పలు ఎరువు దుకాణాలలో జుక్కల్ మండల వ్యవసాయ అధికారి మహేశ్వరి ఆధ్వర్యంలో శనివారం నాడు పలు ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఏవో విలేకరులతో ఒక ప్రకటనలు తెలియజేస్తూ మండల కేంద్రంలోని సంఘమేశ్వర ఆగ్రో ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు చేపట్టగా మొత్తం 25 లక్షల విలువైన మందులు దుకాణంలో ఉన్నాయని అన్నారు. వాటిని పరిశీలించగా అందులో గడువు ముగిసినవి సుమారుగా రెండు లక్షల రూపాయల విలువైన మందులు పట్టుకోవడం జరిగింది. వాటిని సీజ్ చేసి ల్యాబ్ కు పంపడం జరిగిందని తెలిపారు. మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని , ఎవరైనా గడువు ముగిసిన మందులు పక్క రాష్ట్రాల నుంచి తెచ్చినవాటిని రసాయన మందులు, విత్తనాలు,  అమ్మకాలు చేపట్టి రైతులను అంటగట్టడం చేస్తే రైతులకు నట్టేట ముంచిన ఫర్టిలైజర్ దుకాణాల యజమానుల కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. రైతులు అడిగినప్పుడు బిల్లులు ఇవ్వకపోవడం, మండలంలోని ఎవరైనా రైతులు వచ్చి ఫర్టిలైజర్ దుకాణాల యజమానులపై ఫిర్యాదు చేస్తే వ్యవసాయ శాఖ చట్టం ప్రకారం దుకాణాలపై యజమానులపై కఠినమైన చర్యలు మరియు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -