ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి చెట్టుపెళ్లి బిక్షపతి కుమారుడు చెట్టిపెళ్లి రామకృష్ణ వివాహానికి శుక్రవారం చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన జడ్జి సైలేష్ కుమార్, ములుగు జిల్లా ఎన్పీడీసీఎల్ డిఇ పులుసం నాగేశ్వరరావు లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు ఆయురారోగ్యాలతో కలకాలం విరజిల్లాలని ఆశీర్వదించారు. వారి వెంట విద్యుత్ శాఖ ఉద్యోగి లైన్మెన్ మెడిశెట్టి రమణయ్య, మాజీ ఎంపిటిసి దానక నర్సింగరావు, మహిళలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.