– మునిసిపాలిటీకి రూ.15 లక్షల ఆదాయం
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని చికెన్, మాంసం దుకాణాల నుంచి వ్యర్థాల సేకరణ కోసం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. వేలం పాట ద్వారా మున్సిపాలిటీకి రూ.15 లక్షల ఆదాయం చేకూరింది. చికెన్ , మాంసం వ్యర్థాల సేకరణ వేలం పాటలో ఐదు మంది టెండర్ దారులు పాల్గొన్నారు. వెంకటయ్య రూ.15 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసులు, కమిషనర్ యాదయ్య, కౌన్సిలర్ గౌరీ శంకర్, తదితరులు ఉన్నారు.