ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండల కేంద్రానికి చెందిన నల్ల భాగ్యలక్ష్మికి ప్రభుత్వం నుండి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయం చెక్కును బుధవారం అందజేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న భాగ్యలక్ష్మి వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం నిమిత్తం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కృషితో ప్రభుత్వం భాగ్యలక్ష్మి కి రూ.60వేల ఆర్థిక సహాయం చెక్కును మంజూరు చేసింది. అట్టి చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో నాయకులు లబ్ధిదారు ఇంటి వద్దకే వెళ్లి చెక్కును అందజేశారు. ఆర్థిక సహాయం చెక్కు మంజూరుకు  కృషి చేసిన సునీల్ కుమార్ కు లబ్ధిదారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊట్నూరి ప్రదీప్, వేముల గంగారెడ్డి, దూలూరి కిషన్ గౌడ్, అజ్మత్ హుస్సేన్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love