చైనా జీడీపీ 4.6 శాతం వృద్ధి

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4.6 శాతం పెరిగింది. ఆర్థిక నిపుణులు అంచనా వేసిన దాని కంటే మెరుగైన ప్రగతిని కనబర్చింది. తొలి తొమ్మిది మాసాల్లో 4.8 శాతం వృద్ధిని సాధించింది. కాగా.. వార్షిక లక్ష్యం 5 శాతంతో పోల్చితే అతి స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగి.. నాలుగు మాసాల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యిందని ఆ దేశ నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ తెలిపింది.

Spread the love