తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కమ్మర్ పల్లి మండల అధ్యక్షులుగా చింత గణేష్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం బాల్కొండ తెలంగాణ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన దాసరి మూర్తి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యతగా ఉండి బీసీ నాయకుని ఎమ్మెల్యే నుండి ఎంపీ వరకు ప్రధాని వరకు బీసీ నాయకుడే ఆధిపత్యం వహించేలా కృషి చేయాలన్నారు. బీసీ నాయకులు అన్నిట్లో ముందు ఉండి పైకి ఎదగాలని, బీసీలంతా ఐక్యతగా ఉండాలని కోరారు. అనంతరం నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన దాసరి మూర్తిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి గ్రామ సంఘ అధ్యక్షులు భోగ రామస్వామి, గణపతి రామ్, చిలువేరి లక్ష్మణ్, భోగ శ్యామ్, చింత నాగరాజు, చింత నందకుమార్, చింత ప్రవీణ్, వంగ నవీన్, బీసీ నాయకులు, బీసీ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.