మిషన్ గ్రీన్ ఇండియాను ప్రారంభించిన చినుకని శివప్రసాద్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాజానికి మిషన్ గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని తన సొంత గ్రామమైన పంతంగి గ్రామంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని బుధవారం సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని సహస్ర ఫౌండేషన్ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మిషన్ గ్రీన్ ఇండియాను ప్రారంభిస్తున్నామని శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారని,ఈ యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలందరూ మిషన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి విజయవంతం చేయాలని డాక్టర్ శివప్రసాద్ పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడాలని దీనివలన ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకోవచ్చని శివప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చింతల శ్రీకాంత్,మలగ వేణు సహస్ర ఫౌండేషన్ సభ్యులు హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్లు సిహెచ్ఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love