నవతెలంగాణ-హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భోళా శంకర్. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ కీర్తి సురేశ్ చెల్లెలిగా నటిస్తోంది, మెహర్ రమేశ్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి భోళా మేనియా లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ‘అదిరే స్టైల్ అయ్యా.. పగిలే స్వాగయ్యా.. యుఫోరియా నా ఏరియా.. భోళా మేనియా..’ అంటూ పాట మొదలవుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా మహతి స్వరసాగర్, రేవంత్ ఎల్‌వీ ఆలపించారు. ఈ పాటలో మెగాస్టార్ స్వాగ్ అదిరిపోయిందంతే. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది.