నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దండు మల్కాపురం గ్రామం పరిధిలోని డబల్ బెడ్ రూమ్ ఎదురుగా మినీ గూడ్స్ వర్కర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ జెండా మినీ గూడ్స్ వర్కర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బదుల లింగస్వామి శుక్రవారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా మాట్లాడుతూ కష్టజీవులకు అండ కార్మికులకు అండ సిఐటియు జెండా అనే నినాదంతో 1970 మే 3వ తేదీన కలకత్తా నగరంలో మహాసభ నిర్వహించి సీఐటీయూను ఏర్పరచుకోవడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఆటో,లారీ సంఘటిత సంగటిత స్కీము వర్కర్ల సమస్యలపై రాజీలేని పోరాటం నిర్వహించడం జరిగింది. నేటి ప్రభుత్వాలు ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఎన్నో ఆశలు పెట్టి గద్దనెకటం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల వలే ట్రాన్స్పోర్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి కార్మికునికి 26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 60 సంవత్స రాల పైబడినటువంటి పాస్పోర్ట్ కార్మికులకు లారీ కార్మికులకు నెలకు రూ.5 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, వారి పిల్లలకు నాణ్యమైన విద్య వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని ఎండి పాషా కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బత్తుల దాసు మినీ గూడ్స్ వర్కర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు జొన్న కంటి దేవయ్య ప్రధాన కార్యదర్శి బత్తుల లింగస్వామి నాయకులు మీసాల శ్రీను, మంత్రి యాదయ్య,భూపాల్,గుండ్ల మహేష్, ఏ.నరసింహ,గుడ్డేటి పాపయ్య జిపి నాయకులు పప్పీ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.